NTV Telugu Site icon

Citadel: Honey Bunny Trailer: సమంత సిటాడెల్ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా?

Citade

Citade

Citadel: Honey Bunny Trailer Released : వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన యాక్షన్ ప్యాక్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు ఇద్దరూ డిటెక్టివ్‌ల పాత్రలో కనిపించబోతున్నారు. దాదాపు 2 నిమిషాల 51 సెకన్ల నిడివి గల ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, యాక్షన్‌తో నిండి ఉంది. అయితే, ఈ ట్రైలర్‌లో వాళ్ళ డైలాగ్స్ కంటే ఎక్కువగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినవచ్చు. ఈ కథలో స్టంట్‌మ్యాన్ బన్నీగా వరుణ్ ధావన్, ఏజెంట్ హనీగా సమంత) నటించారు.

Jr NTR: దేవర బ్లాక్ బస్టర్.. ఎన్టీఆర్ ఎమోషనల్ నోట్

వారి ప్రమాదకరమైన గతాలు వెలుగులోకి వచ్చినప్పుడు విడిపోయిన హనీ మరియు బన్నీ కొన్ని సంవత్సరాల తర్వాత తమ కుమార్తె నదియా భద్రత కోసం పోరాడేందుకు మళ్లీ ఒక్కటవుతారు. ఈ సిరీస్‌లో కె.కె. మీనన్ సహా సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కీత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముదార్‌ వంటి వారు నటిస్తున్నారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’ నవంబర్ 7న ప్రత్యేకంగా ప్రైమ్ వీడియోలో భారతదేశంలో మరియు 240 కంటే ఎక్కువ దేశాలలో రిలీజ్ కానుంది. ఇక ఈ సిరీస్ కి రాజ్ మరియు డికె (రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికె) దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను D2R ఫిల్మ్స్, అమెజాన్ MGM స్టూడియోస్ మరియు AGBO యొక్క రస్సో బ్రదర్స్ నిర్మించారు.

Show comments