Site icon NTV Telugu

‘గల్లీ రౌడీ’ రొమాంటిక్ సాంగ్ కు 1 మిలియన్ వ్యూస్

1 Million views for Puttene Prema Lyrical Song from Gully Rowdy

జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు.

సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘పుట్టెనే ప్రేమ’ రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సాంగ్ ను రామ్ మిరియాల ఆలపించగా… భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ 1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 1 వీక్ నుంచి ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్ లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. ‘పుట్టెనే ప్రేమ’ లిరికల్ వీడియో సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

https://youtube.com/watch?v=txjK_4EtQ5A
Exit mobile version