Site icon NTV Telugu

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడనున్న సినిమాలు..?

omicron veriant

omicron veriant

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిత్ర పరిశ్రమ అయితే కరోనా దెబ్బకు కుదేలయిపోయింది. ఇప్పుడిప్పుడే అన్నింటికి, అందరికి మంచి రోజులు వస్తున్నాయి.. త్యేతర్లు కళకళలాడుతున్నాయి అనుకొనేలోపు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బి.1.1.529 మరో సవాల్ విసురుతోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్వో చెప్తున్న తరుణంలో ఓమిక్రాన్ కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పటికే వాయిదాల మీద వాయిదాల వేస్తూ వస్తున్నా సినిమాలు పరిస్థితి అయితే దారుణమని చెప్పాలి. రెండేళ్లుగా వాయిదాలు పడుకుంటూ వస్తున్నా ఈ సినిమాలు ఓమిక్రాన్ కేసులు పెరిగితే మరోసారి వాయిదా వేయక తప్పదు.

ఇప్పటికే స్కూల్స్ ఓపెన్ చేసిన కొద్దిరోజులకే విద్యార్థులు కరోనా బారిన పడడం ప్రభుత్వానికి ఆందోళనకు గురిచేస్తున్న విషయం. ఇప్పుడు మళ్లీ ఈ కేసులు ఎక్కువ అయితే.. థియేటర్లలలో సినిమాలు రిలీజ్ చేస్తే.. ఇంకా ముప్పు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఓమిక్రాన్ ఇంపాక్ట్ సెకెండ్ వేవ్ ని మించి ఉంటుందని, రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నా ఓమిక్రాన్ ని ఆపలేవని పరిశోధకులు చెప్పడం గమనార్హం. ఒక వేళ ఇదే కనుక నిజమయ్యి మరోసారి లాక్ డౌన్ వచ్చి థియేటర్లు మూసేస్తే ఎగ్జిబిటర్లు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. చేతిలో డబ్బు లేక, సినిమాలు రిలీజ్ అవ్వక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వలన థియేటర్లు మూసుకోవాల్సి పరిస్థితి.. ఇలాంటి సమయంలో ఈ వైరస్ కూడా ఎటాక్ చేస్తే అంతే సంగతులు.

ఇక డిసెంబర్ మొత్తం టాలీవుడ్ హీరోలు థియేటర్లపై రచ్చ చేయడానికి రెడీ గా ఉన్నారు. డిసెంబర్ 2 ‘అఖండ’ తో మొదలుపెడితే.. డిసెంబర్ 17 న పుష్ప, 24 న గని, శ్యామ్ సింగరాయ్, వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇందులో అఖండ మినహాయింపు అనుకోవచ్చు. మరి ఈ వైరస్ ఈ సినిమాలకు ఎఫెక్ట్ గా మారనుందా ..? లేదా..? అని తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

Exit mobile version