Site icon NTV Telugu

RC16:రాంచరణ్, బుచ్చిబాబు సనా మూవీ పై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్…

Whatsapp Image 2023 06 18 At 9.20.55 Am

Whatsapp Image 2023 06 18 At 9.20.55 Am

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా క్రేజీ సినిమాలను చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రాం చరణ్ ఆ స్థాయికి తగ్గట్టుగానే కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఆసక్తికర ప్రాజెక్టులకు సెట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర దర్శకుడు అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమా ఇప్పటికే షూట్ దాదాపు చివరి స్థాయికి చేరుకుంది.. ఈ సినిమా విడుదల తేదిని మాత్రం ప్రకటించలేదు కానీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది.. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ చేయబోయే RC16 సినిమాపై గత కొన్ని రోజులుగా ఏదొక రూమర్ బాగా వైరల్ అవుతూనే ఉంది.. తాజాగా ఈ సినిమా నుండి మరొక వార్త కూడా వైరల్ అయ్యింది..

RC16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేయబోతున్నాడు అని అందరికి తెలుసు.. ఉప్పెన సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఆ తర్వాత గ్లోబల్ స్టార్ తో సినిమా ప్రకటించడం ఎంతో ఆసక్తిగా మారింది.. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. గత కొన్ని రోజులుగా బుచ్చిబాబు చరణ్ తో చేసే సినిమా కథ ఎన్టీఆర్ కు చెప్పిన కథ అని వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై క్లారిటీ ఇస్తూ రాంచరణ్ కోసం సిద్ధం చేసిన కథ వేరు ఎన్టీఆర్ కు చెప్పిన కథ వేరు అని చరణ్ కోసం బుచ్చిబాబు కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేసి తెరకెక్కిస్తున్నాడు అని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.. దీంతో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ తేల్చి చెప్పేసారు.ఇక RC16 సినిమాను మైత్రి మూవీస్ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ అలాగే వృద్ధి సినిమాస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నట్లు సమాచారం… ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడని సమాచారం. మరీ ఈ సినిమా ఎప్పుడూ సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

Exit mobile version