NTV Telugu Site icon

Manchu Mohan Babu: కోడలితో మోహన్ బాబు అలా ఉన్నాడా.. ఇది పెద్ద షాకే

Mohan Babu

Mohan Babu

Manchu Manoj: మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే మంచు బ్రదర్స్ విబేధాలు బయటపడ్డాయి. అయితే అవన్నీ రియాలిటీ షో కోసమని చెప్పి కవర్ చేశారు. త్వరలోనే ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మంచు మనోజ్.. తాను ప్రేమించిన మౌనిక మెడలో ఈ మధ్యనే మూడు ముళ్లు వేసిన సంగతి తెల్సిందే. అయితే వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు రావడానికి ఈ జంట చాలానే కష్టపడిందట. పెళ్లి తరువాత మనోజ్- మౌనిక మొదటిసారి ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు. వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో వారిద్దరూ వారి మనోగతాలను బయటపెట్టారు. ముఖ్యంగా మనోజ్.. ఆమె కోసం ఎంత తపించాడో చెప్పుకొచ్చాడు. మొదట తానే మౌనికకు ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చిన మనోజ్.. మౌనిక కష్టాలను చూసాక.. నా జీవితంలో చూసిన బాధలు చాలా చిన్నవిగా కనిపించాయని చెప్పుకొచ్చాడు. ” నువ్వంటే ప్రాణం.. జీవితంలో నీ వలనే నేను సంతోషంగా ఉన్నాను. నాకు హ్యాపీగా బ్రతకాలని ఉందని అన్నాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తా అని చెప్పాను. ఎవరు ఏమనుకున్నా ఆలోచించకుండా శివుడికి వినాయకుడు దొరికినట్టు నాకు బాబు దొరికాడు. మా వనవాసం అప్పుడు మొదలయింది. ఉప్పెనలో ఈశ్వరా పాటలా దేశాలు తిరిగేశాం” అని చెప్పుకొచ్చాడు మనోజ్.

Samantha: సామ్ వేసుకున్న ఆ డైమండ్ నెక్లస్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

ఇక వీరి పెళ్లికి మంచు కుటుంబం ఒప్పుకోలేదని, మోహన్ బాబు పెళ్ళికి కూడా రాడని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే మోహన్ బాబు.. కొడుకు పెళ్ళిలో రచ్చ చేశారు. కోడలిని ముద్దాడి ఆ పుకార్లకు చెక్ పెట్టాడు. ఇక ఇదే విషయాన్నీ మౌనిక చెప్పుకొచ్చింది. అలాంటి అత్తామామలు దొరకడం తనకు వరమని చెప్పింది. మోహన్ బాబు అయితే .. తన కొడుకును కూడా సొంత మనవడు లానే చూసుకుంటున్నట్టు తెలిపింది. ” మామయ్య నాతో చాలా సరదాగా ఉంటారు. పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన స్వయంగా నాకు భోజనం తినిపించారు. అలాగే అత్తయ్య ఎప్పుడూ నాతో ఫోన్ లో మాట్లాడూ ఉంటుంది. నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. నన్ను, నా కొడుకు ధైరవ్ ను వాళ్లిద్దరూ సొంతవాళ్ల మాదిరిగా దగ్గరకు తీసుకున్నారు. అత్తయ్య, మామయ్య నాకు దేవుడిచ్చిన వరం” అని చెప్పుకొచ్చింది. ఇక వీరి మాటలు విన్నాకా అభిమానులందరూ షాక్ అవుతున్నారు. మోహన్ బాబు కోడలిని ఇంత బాగా చూసుకుంటాడా .. ఇది పెద్ద షాకే .. పెళ్లి ఇష్టం లేకుండా చేసుకున్నారని అసలు మాట్లాడరేమో అనుకున్నాం అంటూనెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments