Site icon NTV Telugu

Mouni Roy: అమ్మడు.. నీకు పెళ్లి అయ్యింది.. గుర్తుందా.. ఏంటీ అందాల ప్రదర్శన

Mouni

Mouni

Mouni Roy: బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగిని సీరియల్ తో తెలుగువారికి కూడా సుపరిచితమైన ఈ భామ బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఇక గతేడాది ఆమె తాను ప్రేమించిన సూరజ్ నంబియార్ ను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా పెళ్లి తరువాత ప్రతి అమ్మాయిలోనూ మార్పులు సహజం. ముఖ్యంగా అందాల ఆరబోత చేయడానికి కుటుంబం ఒప్పుకున్నా సమాజం ఒప్పుకోదు. బాలీవుడ్ లో ఇవన్నీ కామన్ అయినా కూడా చాలామంది హీరోయిన్లు ఓకే లిమిట్ వరకు మాత్రమే అందాల ఆరబోత చేస్తూ ఉంటారు. కానీ, ఈ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి తరువాత కూడా ఆ లిమిట్ ను దాటి అందాల ఆరబోత చేస్తుంది. ముఖ్యంగా బీచ్ ఒడ్డున బికినీ ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Anni Manchi Sakunamule Trailer: నువ్వు కటౌట్ వే.. ప్రభాస్ వి కాదు

ఇక తాజాగా మరోసారి బికినీ ట్రీట్ ఇచ్చి మరోసారి హీట్ పపెంచింది. బీచ్ ఒడ్డున రెడ్ బికినీలో అమ్మడు అందాల విందు చేసింది. క్లివేజ్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. మౌనీ.. నీకు పెళ్లి అయ్యింది.. గుర్తుందా అని కొందరు.. ఇలాంటి ఫోటోలు పెడుతుంటే నీ భర్త ఏం అనడం లేదా ..? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అవకాశాల కోసం అమ్మడు ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తుందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఈ చిన్నది ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందో చూడాలి.

Exit mobile version