సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరికి మూవీ ఛన్స్‌లు లభిస్తున్నాయి. వారికి యాక్టింగ్ వచ్చా లేదా అనేది పక్కన పెడితే.. ఫాలోయింగ్ ఉంటే చాలు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తున్నారు. అలాంటి వారు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అందులో మౌళి ఒకరు. గతేడాదిలో ‘హ్యాష్‌ట్యాగ్ 90s’ వెబ్ సిరీస్‌తో యువ ప్రేక్షకులకు దగ్గరైన మౌళి.. తాజాగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద బాగా గుర్తింపు సంపాదించాడు. తన డైలాగ్స్ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా చేసిన ‘లిటిల్ హార్ట్స్’ చిన్న సినిమాగా విడుదల అయినప్పటికీ బాక్సాఫీస్‌లో దాదాపు రూ.40 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఓటీటీలో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ విజయంతో మౌళి మార్కెట్‌లో స్థిరంగా నిలిచాడు. దీంతో తాజాగా మౌళికి బిగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Ileana : మూడో సారి తల్లి కాబోతున్న మహేశ్ బాబు హీరోయిన్..
పెద్ద నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తనతో సినిమా ప్లాన్ చేసిందట, కేవలం ఆఫర్ ఇవ్వడమే కాకుండా అడ్వాన్స్‌గా రూ. కోటి కూడా ఇచ్చారని సమాచారం. ఇందులో ఎంత వరకు నిజం ఎందో తెలియదు కానీ. మౌళి రెండో సినిమాకే ఇంత భారీ రెమ్యూనరేషన్ పొందడం ప్రత్యేక విషయం. ఇలా పెద్ద నిర్మాణ సంస్థ కేవలం హిట్ సినిమాకి కాకుండా యువ ప్రేక్షకులతో కనెక్ట్ అయిన స్టార్‌ను నేరుగా తీసుకోవడం, మౌళి సామాజిక మీడియా ఇమేజ్, యూత్ ఫాలోయింగ్ కారణంగా మాత్రమే సాధ్యమైంది. కొత్త సినిమా సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటపడే అవకాశం ఉందని టాక్.
