Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mookuthi Amman 2 Teaser: నయనతార అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. తెలుగు, తమిళ్ లో ఒకే సారి తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను వినాయక చతుర్థి సందర్భంగా రిలీజ్ చేశారు. తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో రాబోతున్న ఈ సినిమా, మొదటి భాగానికి భిన్నంగా మరింత భారీ స్థాయిలో పౌరాణికం, ఫాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ మొదట్లోనే ప్రేక్షకులను మరో కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మేకర్స్. ఒక పురాతన రాజ్యం శత్రువుల దాడితో అల్లకల్లోలంగా మారడం, ప్రజలు ప్రాణాల కోసం పోరాడటం వంటి సన్నివేశాలతో కథకు భారీ నేపథ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కథ ఒక్కసారిగా ప్రజెంట్ కాలానికి మారుతుంది. ఇప్పటి ప్రపంచంలో కూడా ఏదో అర్థంకాని విపత్తు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు టీజర్లో చూపించారు.
చెడు పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమను కాపాడే దైవశక్తి కోసం ఎదురుచూస్తున్నట్లు సన్నివేశాలు కనిపిస్తాయి. అప్పుడే నయనతార మూకుతి అమ్మన్ అవతారంలో మరోసారి తెరపైకి వస్తారు. చేతిలో ఆయుధంతో, శక్తివంతమైన రూపంలో కనిపించే ఆమె పాత్ర ఈసారి భక్తి కోణానికే పరిమితం కాకుండా, చెడును చెండాడే మహాశక్తిగా ఉండబోతున్నట్లు టీజర్ సూచిస్తోంది. 2020లో వచ్చిన ‘మూకుతి అమ్మన్’లో భక్తితో పాటు సామాజిక అంశాలు, వ్యంగ్యాన్ని కలిపి కథను నడిపించారు. అయితే రెండో భాగం మాత్రం పూర్తిగా మరో ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగాన్ని ఆర్జే బాలాజీ తెరకెక్కించగా, సీక్వెల్ బాధ్యతలను సుందర్.సి తీసుకున్నారు. నయనతారతో పాటు రెజీనా కసాండ్రా, ఊర్వశి, దునియా విజయ్, యోగిబాబు, అభినయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిప్హాప్ తమిళా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఐశరి కె. గణేష్ నిర్మిస్తున్నారు.
Also Read
ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. ‘మూకుతి అమ్మన్ 2’ను దీపావళి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 6న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. టీజర్ చూస్తే ‘మహాశక్తి’ మొదటి భాగానికి కొనసాగింపుగా మాత్రమే కాకుండా మరింత భారీ విజువల్ ట్రీట్‌గా రూపొందినట్లు కనిపిస్తోంది. నయనతార మరోసారి దేవతగా కనిపించడంతో పాటు, ఈసారి ఆమె ముందున్న ప్రమాదం ఎంత పెద్దది, మహాశక్తి ఎలాంటి యుద్ధం చేయబోతోంది అనేది సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. మరి థియేటర్లలో నయనతార మహాశక్తి అవతారం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
- Tags
- cinema
- Mookuthi Amman 2
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!