Mookuthi Amman 2: అమ్మోరు పాత్రలో మళ్లీ నయనతార… ఫాంటసీ ఎంటర్టైనర్ కి భారీ ఓటీటీ డీల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mookuthi Amman 2: లేడీ సూపర్‌స్టార్ నయనతార మరోసారి దేవత పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2020లో జియోహాట్‌స్టార్ ఓటీటీలో నేరుగా విడుదలై మంచి స్పందన అందుకున్న ‘మూకుతి అమ్మన్’కు ఇప్పుడు సీక్వెల్‌గా ‘మూకుతి అమ్మన్ 2’ తెరకెక్కుతోంది. దర్శకుడు సుందర్ సి రూపొందిస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్టైనర్పై ఇప్పటికే అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కుల విషయంలో కూడా పెద్ద వార్త వినిపిస్తోంది. జియోహాట్‌స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ‘మూకుతి అమ్మన్ 2’ డిజిటల్ హక్కుల కోసం జియోహాట్‌స్టార్‌తో చిత్రబృందం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్ విలువ ఎంత అన్నది వెల్లడికాలేదు. మొత్తాన్ని బయటపెట్టకపోయినా, ఇది మంచి ఫ్యాన్సీ రేటుకే వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్లో నయనతార మరోసారి అమ్మన్ (అమ్మోరు తల్లి) పాత్రలో కనిపించనుండగా, ఈసారి కథలో ప్రతినాయకురాలిగా రెజీనా కసాండ్రా నటిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు సుందర్ సి తనదైన శైలిలో ఫాంటసీ, కామెడీ, సామాజిక వ్యంగ్యాన్ని కలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
‘మూకుతి అమ్మన్ 2’ 2020లో వచ్చిన ‘మూకుతి అమ్మన్’కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మొదటి భాగానికి ఆర్.జే. బాలాజీ, ఎన్.జే. శరవణన్ దర్శకత్వం వహించగా, నయనతార దేవత పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ‘మూకుతి అమ్మన్’ (అమ్మోరు తల్లి) కథ ఒక పేద లోకల్ రిపోర్టర్ ఎంగెల్స్ రామస్వామి (RJ బాలాజీ) కుటుంబ కష్టాల చుట్టూ తిరుగుతుంది. వారి కష్టాలు తీర్చడానికి వారి కులదైవమైన మూకుతి అమ్మన్ (నయనతార) మానవ రూపంలో భూమిపైకి వస్తుంది. అయితే, అమ్మవారు కేవలం ఆ ఒక్క కుటుంబం కోసమే కాకుండా, దేవుడి పేరుతో ప్రజలను మోసం చేస్తూ 11,000 ఎకరాల పేదల భూమిని లాక్కోవాలని చూస్తున్న ‘భగవతి బాబా’ అనే నకిలీ గాడ్‌మ్యాన్ అక్రమాలను అరికట్టడానికి వస్తుంది. అమ్మవారు తన దైవశక్తితో కాకుండా, ఎంగెల్స్ టీవీ ఛానల్ ద్వారా బాబా మోసాలను సాక్ష్యాధారాలతో ప్రజల ముందు ఉంచి అతని అసలు రూపాన్ని బయటపెడుతుంది. దేవుడు మన నమ్మకంలోనే ఉన్నాడని, గుడ్డిగా మోసగాళ్లను నమ్మవద్దనే మంచి సోషల్ మెసేజ్ తో ఈ కథ ముగుస్తుంది.
Also Read
నకిలీ ఆధ్యాత్మిక గురువులను వ్యంగ్యంగా బట్టబయలు చేసే కథ అప్పట్లో మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా సోషల్ మెసేజ్ ని కామెడీ స్టైల్ లో చూపించిన తీరు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. మొదటి భాగంలో నయనతారతో పాటు ఆర్.జే. బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్, అభినయ, మౌళి, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైనా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నయనతార చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. యష్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ లో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆ భారీ పాన్ ఇండియా మూవీ 2026 ఆగస్టు 26న విడుదల కానుంది. అలాగే కెవిన్ తో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘హాయ్’ కూడా ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘మూకుతి అమ్మన్ 2’ ఓటీటీ డీల్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, దేవత పాత్రలో నయనతార మరోసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలనే ఆసక్తి పెరుగుతోంది.
- Tags
- cinema
- Mookuthi Amman 2
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!