బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకెళ్తున్నాడు మలయాళ కంప్లీట్ స్టార్ మోహన్ లాల్. నేరు తర్వాత భారీ బడ్జెట్ అండ్ ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్న మోహన్ లాల్ పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ తో ట్రాక్ లోకొచ్చాడు. ఆ సినిమా రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను జస్ట్ నెల రోజుల గ్యాప్‌లో రిలీజ్ చేసాడు. తుడరుమ్ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Virgin Boys : వర్జిన్ బాయ్స్’ టీజర్ రిలీజ్
మలయాళ సినిమా ఇండస్ట్రీలో మోహన్ లాల్ అనే పేరుతో సంచలనాలు నమోదు చేసి మరెవరు అందుకోలేని రికార్డులు సెట్ చేసాడు మోహన్ లాల్. వాటిలో కొన్ని పరిశీలిస్తే పులిమురుగున్ సినిమాతో కేరళ సినిమా చరిత్రను మార్చేశాడు లాల్. 2016 లో వచ్చిన ఈ సినిమా మొట్ట మొదటి రూ. 100 కోట్లు గ్రాస్ రాబట్టిన సినిమాగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది వచ్చిన ఎంపురాన్ తో ఓన్లీ ఓవర్సీస్ లో రూ. 100 కోట్లు, అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 100 షేర్ రాబట్టిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన తుడరుమ్ తో మరో సంచలనం నమోదు చేసాడు మోహన్ లాల్. ఏప్రిల్ 25న రిలీజైన తుడరుమ్ వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా కేవలం కేరళలోనే రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ క్రియేట్ చేసాడు మోహన్ లాల్.
