Site icon NTV Telugu

మోహన్ లాల్ కు విందు ఇచ్చిన మోహన్ బాబు!

Mohanlal met Mohan Babu Family in Hyderabad

మలయాళీ సీనియర్ స్టార్ హీరోలకు తెలుగు సినిమా రంగంతోనూ, హైదరాబాద్ తోనూ గాఢానుబంధమే ఉంది. మోహన్ లాల్ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక మమ్ముట్టి అయితే ‘యాత్ర’ మూవీ చేశారు. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించే మలయాళ చిత్రాల షూటింగ్స్ సైతం హైదరాబాద్ లో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ ‘బ్రో డాడీ’ షూటింగ్ హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

Read Also : భార్య ఆరోపణలపై స్పందించిన హనీ సింగ్

ఇందులో మోహన్ లాల్ సరసన మీనా నటిస్తోంది. వీరిద్దరినీ ఇటీవల మోహన్ బాబు తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. అంతేకాదు… మోహన్ లాల్ అయితే… క్వాలిటీ టైమ్ ను మోహన్ బాబు కుటుంబ సభ్యులతో గడిపారు. మోహన్ బాబు సతీమణి నిర్మల, కుమార్తె మంచు లక్ష్మీ, కొడుకు కోడలు విష్ణు, విరోనికా వీళ్ళంతా కలసి మోహన్ లాల్ తో ఫోటోలు కూడా దిగారు. వీటిని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నటనకు ఎల్లలు లేవు అన్నట్టుగానే, స్నేహానికీ ఎల్లలు ఉండవని మోహన్ బాబు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటారు!

Exit mobile version