మోహన్‌లాల్ నటించిన మల్టీస్టారర్ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ డిజిటల్ లోనే రాబోతోంది. డిసెంబర్ 2న ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా విడుదలకు రంగం సిద్ధం అయింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 ప్రథమార్ధంలోనే థియేట్రికల్ రిలీజ్ కావలసి ఉంది. అయితే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది.
ఇటీవల ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయటానికి నిర్ణయించారు. నిర్మాత ఆంథోనీ డైరెక్ట్ డిజిటల్ ని ధృవీకరించారు. మోహన్‌లాల్, ప్రియదర్శన్‌తో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన. అయితే ఇటీవల మోహన్‌లాల్ ‘మరక్కర్’ డిసెంబర్ 2న థియేటర్స్ లో విడుదలవుతుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మరక్కర్ – అరబికడలింటే సింహం’ డిసెంబర్ 2, 2021న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందరూ అనుభవించబోతున్నారని ఆయన ట్వీట్ చేశాడు. అయితే ఏమైందో ఏమో మేకర్స్ ఎందుకు డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపారో తెలియరాలేదు. కారణం ఏమైనప్పటికీ ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ సినిమా విడుదల మోహన్ లాల్ ఫ్యాన్స్ కి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, మంజు వారియర్, అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, ప్రణవ్ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.