Lucifer 2 Empuraan Movie : మలయాళం సినిమా ఇండస్ట్రీ కొత్త కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ సినీ ప్రేక్షకులను మెపిస్తూ, విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ ముందుకు సాగిపోతున్న సంగతి తెలిసిందే. మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతో మని టాలెంటెడ్ నటీనటులు మెథడ్ యాక్టింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అలరిస్తున్నారు. ఇక అదే మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి అటు మాస్, ఇటు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ కంప్లీట్ యాక్టర్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు హీరో మోహన్ లాల్. నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు, ఆయన మలయాళం సహా పలు భాషల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి అలరించారు.
Sitara Ghattamaneni: బంగారుకొండ సితార.. ముద్దుపెట్టుకున్న బామ్మ.. వీడియో వైరల్
2019లో ఈయన డైరెక్ట్ చేసిన సినిమా లూసిఫర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇక ఇపుడు దానికి కొనసాగింపుగా ఇప్పుడు ‘ఎల్2ఇ: ఎంపురాన్ (L2E: Empuraan)’ అనే సినిమా మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో రూపొందనుంది. ఆంటోని పెరంబవూర్ చైర్మన్‌గా కొనసాగుతోన్న ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కలయికలో, జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతృత్వంలో ఈ సినిమా రూపొందనుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇదే సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ అనే పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ లూసిఫర్ సీక్వెల్ అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది చూడాలి మరి.