Site icon NTV Telugu

RC15: చరణ్ కోసం రంగంలోకి మలయాళ స్టార్..?

Mohan Lal In Rc15

Mohan Lal In Rc15

Mohan Lal To Play Key Role In RC15 Movie: రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఒక భారీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! పొలిటికల్ త్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కీలక పాత్రల కోసం పరభాష నటుల్ని కూడా తీసుకుంటున్నారు. ఆల్రెడీ జయరాం, ఎస్‌జే సూర్య నటిస్తున్నట్టు స్వయంగా చిత్రబృందమే రివీల్ చేసింది. ఇప్పుడు మరో మలయాళ స్టార్‌ను రంగంలోకి దింపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ మరెవ్వరో కాదు.. మోహన్ లాల్. ఈ సినిమా ద్వితీయార్థంలో ఆయన పాత్ర ఎంట్రీ ఇస్తుందని.. దర్శకుడు శంకర్ చాలా డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ఈ పాత్రని డిజైన్ చేశాడని అంటున్నారు. తొలుత కొందరిని పరిశీలించాక, ఫైనల్‌గా మోహన్ లాల్‌ని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రకి గాను ఆయనకు భారీ పారితోషికమే ముట్టిందని చెప్తున్నారు. అయితే.. ఈ వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కాగా.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి, తదితర నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి.. ఇటీవల శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్‌ని తిరిగి ప్రారంభించడంతో, RC15 షూటింగ్ ఆలస్యం అవుతుందేమోనని అనుమానాలు రేకెత్తాయి. అయితే.. అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, తాను ఏకకాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్స్ నిర్వహిస్తున్నానని, ముందుగా చెప్పిన సమయానికే RC15 సినిమాను విడుదల చేస్తామని శంకర్ క్లారిటీ ఇచ్చాడు.

Exit mobile version