NTR31: జనతా గ్యారేజ్ కాంబో రిపీట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ. ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ రావడం వల్ల.. అతని తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టుగానే తీర్చిదిద్దేందుకు దర్శకులు చాలా కసరత్తులే చేస్తున్నారు. కథ పరంగానే కాదు, నటీనటుల్ని కూడా ఏరికోరి మరీ తీసుకుంటున్నారు. ఆయా భాషా పరిశ్రమల్లో పేరుగాంచిన వారిని రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా NTR31 ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తెరమీదకి వచ్చింది.
కొరటాల శివతో NTR30 చేస్తోన్న తారక్.. ఆ తర్వాత తన 31వ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే! అవును, ఇది సెట్స్ మీదకి వెళ్లడానికి ఇంకా చాలా సమయమే ఉంది. అయినప్పటికీ, ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ఇందులో ఓ కీలక పాత్ర కోసం మోహన్‌లాల్‌ని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట! నిజానికి.. మొదట్లో ఈ పాత్ర కోసం లోకనాయకుడు కమల్ హాసన్‌ని సంప్రదించినట్టు ఓ ప్రచారం జరిగింది. ఇప్పుడు మోహన్ లాల్ పేరు తెరమీదకి వచ్చింది.
Also Read
ఇప్పటికే మోహన్‌లాల్‌ను సంప్రదించడం, కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే.. ‘జనతా గ్యారేజ్’ తర్వాత రెండోసారి తారక్, మోహన్‌లాల్ వెండితెర పంచుకోనున్నారు. మరి, ఈ కాంబో రిపీట్ అవుతుందో లేదో చూడాలి. మరోవైపు.. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ని రంగంలోకి దింపనున్నారని మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్తపై కూడా అధికార స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Kapil Sibal: భారత్‌లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
-
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్‌పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!