గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్‌ను లెజెండరీ యాక్టర్ డా. ఎం. మోహన్ బాబు అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఈ అవార్డును విశిష్ట అతిథుల మధ్య ప్రదానం చేశారు. తరువాత ఎట్ హోమ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు, మా అధ్యక్షుడు విష్ణు మంచు, మా కోశాధికారి శివ బాలాజీ సందడి చేశారు.
Also Read:Akira Nandan: అకిరా నందన్ AI లవ్ స్టోరీ.. హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం ఓ ప్రత్యేక చరిత్రను సృష్టించినట్టుగా నిలిచింది. మోహన్ బాబు 50 సంవత్సరాల సినీ జీవితంలో కళామతల్లికి చేసిన సేవ, అట్టడుగు స్థాయి నుండి భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదగడం, విద్య, దాతృత్వంలో సమాజంపై చెరగని ముద్ర వేయడం గురించి అందరికీ తెలిసిందే. కళకు, కళాకారులకు హద్దులు ఉండవని, భాషా సరిహద్దులు ఉండవని, అంతా ఒక్కటే అనే గణతంత్ర దినోత్సవ సారాంశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. మోహన్ బాబు ఈ అవార్డుని అందుకోవడంతో టాలీవుడ్ సెలెబ్రిటీలు, ఆయన అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
