కరోనా సంక్షోభం మధ్య ఈ డిసెంబర్‌లో అనేక తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన “అఖండ” చిత్రం అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లకు వచ్చి సినిమాలను ఆస్వాదించడానికి జనాలు ఎలాంటి సమయంలోనైనా ఇష్టపడతారని “అఖండ” రోరింగ్ సక్సెస్ నిరూపించింది. తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్ర విజయం బలాన్నిచ్చింది. తాజాగా “అఖండ” చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఇదే విధంగా స్పందించారు.
Read Also : నీలాంటి వారిని చూస్తే ఈర్ష్య… మహేష్ పై ఎన్టీఆర్ కామెంట్
మోహన్ బాబు మాట్లాడుతూ “సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది, విడుదలకి సిద్దంగా ఉన్న చాలా సినిమాలకి ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు బాలయ్యకి, ఆ చిత్ర దర్శకుడికి, నిర్మాతకి, సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులకు అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు. మంచి సినిమాని అదరించే ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు” అంటూ ‘అఖండ’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు మోహన్ బాబు.
