Site icon NTV Telugu

Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?

Mohan

Mohan

Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే ఆయనను ట్రోల్ చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన చేసిన రికార్డులు.. మాములుగా ఉండేది కాదు. పాత్ర ఏదైనా మోహన్ బాబు దిగనంత వరకే అని చెప్పుకొచ్చేవారు. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా .. ఒకటని కాదు.. ప్రయోగాలు చేయడంలో మోహన్ బాబు తరువాతే ఎవరైనా అని చెప్పుకొనేలా ఉండేవాడు. కానీ, ఇప్పుడు బిడ్డల వలన ట్రోల్స్ బారిన పడుతున్నాడు. ఒకప్పుడు మోహన్ బాబు సినిమా వస్తుంది అనే .. థియేటర్ ముందు పెద్ద క్యూ ఉండేది. కానీ, ఇప్పుడు మోహన్ బాబు సినిమాకు కలక్షన్స్ కూడా రావడం లేదు. గతేడాది సన్నాఫ్ ఇండియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్ బాబు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత కొడుకుల మధ్య విబేధాలను తీర్చడంలో బిజీగా ఉన్న మోహన్ బాబు.. ఎట్టకేలకు ఏదో ఒక విధంగా మనోజ్ కు పెళ్లి చేసి.. ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

Urvashi Rautela: మొన్న రూ. 200కోట్ల నెక్లెస్.. నేడు రూ.190 కోట్ల బంగ్లా.. పాపకు అంత సీన్ ఉందా..?

ప్రస్తుతం విష్ణు- మనోజ్ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు నేడు శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు అందుకున్నాడు. ఇక దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “మేము త్వరలోనే వంద కోట్ల రూపాయల బడ్జెట్తో ఓ భారీ సినిమాను చేయబోతున్నాం. దీనికి సంబంధించిన వివరాలు అన్నీ విష్ణు బాబు త్వరలోనే వెల్లడిస్తాడు” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా నెట్టింట కలకలం ఏర్పడింది. అసలే మోహన్ బాబు కుటుంబం నుంచి వస్తున్న సినిమాలకు డిమాండ్ లేదు. ఇప్పుడు ఏకంగా వంద కోట్లు అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కూడా మోహన్ బాబు యూనివర్సిటీ లోనే జరుగుతుందంట.. చదువు.. దాని విలువ గురించి చెప్పే కథ అని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

Exit mobile version