NTV Telugu Site icon

Mohan Babu: కృష్ణ పార్థివ దేహంపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన మోహన్ బాబు

Mohan Babu

Mohan Babu

Mohan Babu: సూపర్ స్టార్ కృష్ణకు, నటుడు మోహన్ బాబుకు మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మోహన్ బాబు.. కృష్ణతో మాట్లాడేవారట.. ఇక ఇటీవలే మా ఎలక్షన్స్ లో మంచు విష్ణుకు సపోర్ట్ గా నిలిచి అతని విజయానికి కారణమైనవారిలో కృష్ణ ముఖ్యుడు. విష్ణు సైతం ఎన్నోసార్లు కృష్ణ గురించి చెప్పుకొచ్చాడు. ఇక నేడు కృష్ణ మృతి చెందారన్న వార్త వినగానే మహ బాబు కొడుకులతో కలిసి ఆయనకు నివాళులు అర్పించడానికి తరలివచ్చారు.

నార్మల్ గా అయితే మోహన్ బాబు ఎక్కడ ఎక్కువ ఎమోషనల్ అవ్వరు. కానీ, కృష్ణ పార్థివ దేహాన్ని చూడగానే మోహన్ బాబు చిన్నపిల్లాడిలా మారిపోయారు. ఆయన పార్థివ దేహంపై పడి వెక్కి వెక్కి ఏడ్చారు. కృష్ణతో ఉన్న అనుబంధాన్ని చెప్తూ బోరున విలపించారు. మహేష్ ను హత్తుకొని గట్టిగా ఏడుస్తున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోహన్ బాబు ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు అంటే.. వారి మధ్య ఎంతటి అనుబంధం ఉందో తెలుస్తుందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments