Site icon NTV Telugu

‘మా’ ప్రెసిడెంట్ అనుమతి లేనిదే మీడియా కు వెళ్లొద్దు

Mohan Babu Comments on MAA New President

నిన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాతో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి ముందుకు వెళదాం ముందు పాజిటివ్ కామెంట్స్ చేశారు.

Read Also : నాగబాబు శల్య సారధ్యం చేశారా!?

“అందరికీ నమస్కారం. ఒకరి విజయం కాదు. సభ్యులందరి విజయం. అందరూ మనవాళ్ళే. ఓట్లు ఎటు పడ్డా ‘మా’ ఆశీస్సులతో బిడ్డ గెలిచాడు. ఎన్నో హామీలు ఇచ్చారు, ఎంతో జరిగింది. గతం గతః. అందరం ఒక తల్లి బిడ్డలం. వివాదాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రెసిడెంట్ అనుమతి లేకుండా మీడియాకు వెళ్ళొద్దు. ఎవర్ని తులనాడొద్దు. ‘మా’కు రెండు రాష్ట్రాల సీఎంల ఆశీస్సులు ఉంటాయి. ఇక ఈ గెలుపుకు కారణమైన నా తమ్ముడు నరేష్ ఎంత కష్టపడ్డాడో మీకు తెలియదు. దాదాపు 800 మందికి ఫోన్ చేయించాడు. ఆయన చేసిన కృషికి హాట్సాఫ్ నరేష్. ఇది అందరి విజయం. కృష్ణ, కృష్ణంరాజు, బాలయ్య, నాగార్జున, ఆత్మీయులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలి. అందరం కలిసి ముందుకు వెళదాం” అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

Exit mobile version