Simha Koduri: ఆస్కార్ విజేత MM కీరవాణీ చిన్న కొడుకు శ్రీసింహా పెళ్లి పీటలు ఎక్కనున్నాడని వార్తలు వస్తున్నాయి. మత్తు వదలరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమయ్యాడు శ్రీసింహా. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీసింహా.. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా.. అంతటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ మధ్యే భాగ్ సాలే , ఉస్తాద్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా .. అది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తండ్రి లానే పెద్ద కొడుకు కాల భైరవ కూడా సంగీతాన్ని నమ్ముకొని నేషనల్ అవార్డు ను అందుకొని ముందుకు సాగుతున్నాడు. శ్రీసింహా నటనలోనే హిట్ అందుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం. సింహా.. పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది.
Rakul Preeth Singh : ట్రెండీ వేర్ లో రెచ్చగొడుతున్న రకుల్..
నటుడు, రాజకీయ నాయకుడు అయిన మురళీ మోహన్ మాగంటి మనవరాలు రాగ మాగంటితో సింహా పెళ్లి జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మురళీ మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత పేరుతో పారు ధనవంతుల జాబితాలో ఉన్న సెలబ్రిటీలలో ఆయన ఒకరు. మురళీ మోహన్ కొడుకు రామ్ మోహన్ కుమార్తె రాగ. విదేశాల్లో ఐఎస్‌బీలో మాస్టర్స్ పూర్తిచేసి ఇండియాకు వచ్చి తండ్రి వ్యాపారాలను చూసుకొంటుంది. ఇక వీరిది పూర్తిగా పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు అని చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. సింహా కన్నా పెద్దవాడు కాల భైరవ పెళ్లి జరగకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవడం ఏంటి.. లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ రెండు కుటుంబాలు వీరి పెళ్లి వార్తను అధికారికంగా చెప్పనున్నాయని సమాచారం. మురళీ మోహన్ ఇంటి అల్లుడుగా శ్రీసింహా సినిమాల్లో నటిస్తాడా.. ? లేక వ్యాపారాల్లో భాగం అవుతాడా..? అనేది చూడాలి.