NTV Telugu Site icon

MM Keeravaani: మహేష్ బాబు సినిమా అప్డేట్ అడిగితే, ఫోన్ స్విచ్ఛాఫ్!

Mm Keeravaani

Mm Keeravaani

MM Keeravaani about Rajamouli Mahesh babu Film: ఒకరకంగా ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి ఇప్పటికే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని రాజమౌళి సినిమాలకి కథల అందించే విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక ఈ మధ్య ఒక ఇండోనేషియన్ భామను ఆ సినిమా కోసం హీరోయిన్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వమని రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని అడిగితే ఆయన ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. తాజాగా నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన కీరవాణి ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు.

Vijay Deverakonda: తమిళ్ లో రికార్డు కొట్టిన విజయ్ దేవరకొండ “ఖుషి”
ఈ సందర్భంగా రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి ప్రస్తావన రావడంతో తనకు అసలు ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ తనకు కూడా లేదని కీరవాణి చెప్పుకొచ్చాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ పరంగా ఇంకా మహేష్ బాబు రాజమౌళి సినిమాకి ఎలాంటి పనులు మొదలు కాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలంటే కేవలం రాజమౌళి ఒక్కడే ఇవ్వగలడు కానీ ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ ఆయన నవ్వేశారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన మూడు పాటలు పూర్తి చేశామని, ప్రస్తుతానికి క్రిష్ అందుబాటులో లేడు కాబట్టి ఆయన వచ్చాక మిగతా పాటలు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు తనకు రీసెంట్ గా వచ్చిన సినిమాలలో యానిమల్ సినిమా సాంగ్స్ బిజిఎం తో పాటు జైలర్ సినిమా బిజిఎం నచ్చిందని ఆయన పేర్కొన్నాడు.