NTV Telugu Site icon

Mr Bachchan: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కన్నా ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నారుగా..

Ravi

Ravi

Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక బాలీవుడ్ లో హిట్ అయిన రైడ్ సినిమాకు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతుంది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. తాజాగా టీం ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేసింది. రవితేజతో పాటు ఇతర తారాగణం పై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో అద్భుతంగా చిత్రీకరించారు. అనంతరం ‘మిస్టర్ బచ్చన్’ టీం, మాస్ మహారాజా రవితేజతో కలసి పబ్లిక్ బ్లాక్ బస్టర్ ‘ఈగల్’ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తుకున్నారు.రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందులో ఈగల్ కూడా విజయం అందుకోవడంతో రవితేజ ఫ్యాన్స్.. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments