Site icon NTV Telugu

MISSION MAJNU: రశ్మిక ఫస్ట్ హిందీ మూవీ రిలీజ్ డేట్ లాక్డ్!

south indian actress Rashmika mandanna Bollywood debue film Mission Majnu movie release date fixed.

సిద్ధార్థ్‌ మల్హోత్రా, రశ్మిక మండణ్ణ నటిస్తున్న చిత్రం ‘మిషన్‌ మజ్ను’. 1970 సమయంలో పాకిస్తాన్ నడిబొడ్డున జరిగిన ‘రా’ మిషన్ కు సంబంధించిన సంఘటనలతో ఈ సినిమాను సంతాను బాగ్చీ తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ఫిబ్రవరి మాసంలో లక్నోలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ యేడాది మే 13న సినిమా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 10కి వాయిదా వేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. రశ్మిక మండణ్ణ నటించిన ‘పుష్ఫ’ ఇప్పటికే హిందీలో డబ్ అయ్యి చక్కని విజయాన్ని సాధించింది. ఈ నెల 11న ‘రాధేశ్యామ్‌’ హిందీ వర్షన్‌ కూడా రిలీజ్ కాబోతోంది. అయితే రశ్మిక అంగీకరించిన మొట్టమొదటి స్ట్రయిట్ హిందీ సినిమా ‘మిషన్‌ మజ్ను’ నే కావడం విశేషం! సో… ఈ మూవీతో రశ్మిక ఉత్తరాది ప్రేక్షకులను, దర్శక నిర్మాతలను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version