Opal Suchata : మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. థాయ్ లాండ్ కు చెందిన ఒపల్ సుచాత మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమె నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. ‘నేను ఇండియన్ కల్చర్, సినిమాలు, ఫుడ్ గురించి చాలా సార్లు విన్నాను. ఇక్కడకు వచ్చిన తర్వాత స్వయంగా చూశాను. నాకు బాలీవుడ్ సినిమాల గురించి తెలుసు. ఆలియా భట్ నటించిన గంగూభాయ్ మూవీ చూశాను. అది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సినిమా.
Read Also : Shubham : ‘శుభం’ మూవీ OTT రిలీజ్ డేట్‌ఫిక్స్..
హైదరాబాద్ వచ్చాక రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లాం. అక్కడ బాహుబలి సెట్స్ చూశాను. నేను అంతకు ముందే బాహుబలి మూవీ గురించి విన్నాను. కానీ చూడలేదు. సెట్స్ చూసిన తర్వాత కచ్చితంగా ఆ సినిమా చూడాలని అనుకున్నాను. నెక్ట్స్ టైమ్ ఇండియాకు వచ్చినప్పుడు కచ్చితంగా ఆ సినిమా గురించి రివ్యూ ఇస్తాను. హైదరాబాద్ లో అద్భుతమైన ప్రయాణం చేశాను. ఇక్కడ ఎన్నో కట్టడాలు చూశాను. తిండి కూడా చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి’ అంటూ తెలిపింది ఈ బ్యూటీ.
Read Also : Nikhil Siddhartha : ‘స్వయంభూ’ నుండి అద్భుతమైన పోస్టర్ రిలీజ్..
