Miss Shetty and Mr Polishetty: నిశ్శబ్దం సినిమా తరువాత లేడీ సూపర్ స్టార్ అనుష్క సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. బరువు తగ్గడానికి ఆ గ్యాప్ తీసుకుందని కొందరు, సినిమాలు చేయడం ఇష్టం లేక అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. కానీ, అందులో ఏది నిజం కాదని.. స్వీటీ తన తదుపరి సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో స్వీటీ నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాతిరత్నం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఎన్నో రోజుల తరువాత వెండితెరపై స్వీటీ ని చూసే అవకాశం పోయిందే అని అభిమానులు నిరాశ చెందారు. అయితే తాజాగా అనుష్క అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని మేకర్స్ తెలిపారు.
Vithika Sheru: బ్రా కలక్షన్స్ చూపించిన వరుణ్ భార్య.. సిగ్గుపడకండి
ఇక అదే రోజున షారుఖ్ ఖాన్ జవాన్ సైతం రిలీజ్ కు సిద్దమవుతుంది. జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. మొట్ట మొదటి సారి షారుఖ్ సరసన నయన్ నటిస్తుంది. ఇంకోపక్క ప్లాప్ నే అందుకొని అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనుష్క సైతం అదే డేట్ కు రావడం అభిమానులకు కొద్దిగా ఆందోళనకు గురిచేస్తోంది. అనుష్క.. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్.. నయన్.. కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్.. వీరిద్దరి మధ్య పోటీ అంటే కొద్దిగా ఆసక్తి రేపుతోంది. మరి ఇందులో ఎవరు విన్ అవుతారో చూడాలి అంటే వచ్చేనెల వరకు ఆగాల్సిందే.