Site icon NTV Telugu

Mysskin: పాపులర్ స్టార్స్ తో మిస్కిన్ ‘పిశాచి-2’… ఫస్ట్ సింగల్ విడుదల!

Kaalamentha Vegamule -

Kaalamentha Vegamule -

 

విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘పిశాచి’ తెలుగు, తమిళ భాషల్లో చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మిస్కిన్ ‘పిశాచి2’ తో ప్రేక్షకుల ముందుకు మరోసారి వస్తున్నారు. ఇది ‘పిశాచి’కి సీక్వెల్ కాదు. అయితే అదే జోనర్‌లో తెరకెక్కుతోంది. ‘పిశాచి’ చిత్రంలో కొత్త నటీనటులతో వచ్చింది. అయితే రెండవ ఫ్రాంచైజీలో ఆండ్రియా జెరెమియా, విజయ్ సేతుపతి, సంతోష్ ప్రతాప్, పూర్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘దిల్‌’ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది.

 

ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగల్ ‘కాలమెంత వేగములే…’ బుధవారం విడుదలైంది. సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, గాయకుడు సిద్ శ్రీరామ్‌ మ్యాజికల్ కాంబినేషన్‌లో హార్ట్ టచ్చింగ్ గా ఉందీ పాట. ఎప్పటిలానే సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటకు పోతుల రవికిరణ్ సాహిత్యం అందించారు. ఇప్పటికే విడుదలైన ‘పిశాచి -2’ టీజర్ జనాలను ఆకట్టుకోగా, ఇప్పుడీ ఫస్ట్ సింగల్ సైతం ఇన్ స్టెంట్ హిట్ అయ్యింది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటిస్తామన్నారు.

 

 

Exit mobile version