Mirzapur: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మిర్జాపూర్ పోస్టర్స్! మున్నా భాయ్ మళ్లీ వస్తున్నాడా?

Mirzapur

Mirzapur

Mirzapur: ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ సిరీస్ ఇప్పుడు వెండితెరపై రచ్చ చేయడానికి రెడీ అవుతుంది. ‘మిర్జాపూర్: ది మూవీ’ (Mirzapur: The Movie) టీజర్ రిలీజ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు, చిత్ర యూనిట్ ప్రేక్షకులలో అంచనాలను స్కై హైకి తీసుకెళ్లేలా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మిర్జాపూర్ సామ్రాజ్యాన్ని శాసించిన ఐకానిక్ పాత్రలైన కాలీన్ భయ్యా, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా లుక్స్‌తో మేకర్స్ ఈ పోస్టర్లను డిజైన్ చేశారు. “గద్దీ హై తో హమ్ హమ్ హై” (సింహాసనం ఉంటేనే మనం ఉంటాం) అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్లు.. ఈ సినిమాలో అధికారం, వారసత్వం, రక్తపాతం ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో హింట్ ఇస్తున్నాయి. ఈ క్రేజీ క్యారెక్టర్లు మళ్లీ థియేటర్లలో సందడి చేయనుండటంతో అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది.

ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, పునీత్ కృష్ణ కథను అందించారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్‌తో కలిసి ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కాసిమ్ జగ్‌మాగియా, విశాల్ రామ్‌చందానీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు భాషలోనూ ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. రేపు రిలీజ్ కానున్న ఈ చిత్ర టీజర్ కోసం సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

×
×
Ad