యంగ్ హీరో తేజ సజ్జ, రితికా నాయక్ జంటగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన “మిరాయ్” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను అందుకుని తేజ సజ్జ కెరీర్‌లో మరో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవానే నడుస్తోంది. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. దీంతో చాలా రోజుల తర్వాత.. అటు నిర్మాత, ఇటు డిస్ట్రిబ్యూటర్‌లు భారీ లాభాలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు అయితే రిలీజ్ రోజు ఆడియెన్స్‌కు చిన్న నిరాశ ఎదురైంది. కారణం ఏమిటంటే..
Also Read : RGV : రితేష్ దేశ్‌ముఖ్ – రామ్ గోపాల్ వర్మ కలయికలో ఛత్రపతి శివాజీ బయోపిక్.. ట్వీట్ వైరల్
విడుదలకు ముందే బ్లాక్ బస్టర్‌గా మారిన “వైబ్” సాంగ్ పూర్తిగా సినిమాలో లేకపోవడం. దీంతో అభిమానులు కొంత అసంతృప్తి గా ఉన్నారు. రిలీజ్ అయిన కానుంచి సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపిన ఈ పాట కోసం ధియేటర్ లో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాను. కానీ మూవీ టీం వారిని నిరాశపరిచింది. ఇక ఫైనల్‌గా ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఆ వైబ్ సాంగ్‌ను నేటి నుంచి థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ పాట కోసం ఎదురు చూసిన అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా, మంచు మనోజ్ పవర్‌ఫుల్ రోల్‌లో ఆకట్టుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది.
