Minister Roja: నందమూరి బాలకృష్ణ ఏది చేసినా వివాదమే.. ఏది మాట్లాడినా కాంట్రవర్సీనే. మైక్ ఎదురుగా ఉంటే బాలయ్య ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఈ మధ్యనే బాలయ్య నెత్తిన మరో వివాదం పడింది. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని కుటుంబాన్ని ఆయన అవమానించారు. అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడడం పెద్ద వివాదానికి తెరలేపింది. ఇక ఈ వివాదంపై అక్కినేని వారసులు సైతం స్పందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు లాంటి వారిని అవమానిస్తే మనల్ని మనమే అవమానించుకోవడం అని సున్నితంగా కౌంటర్ వేశారు. ఇక ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. సీన్ లోకి మంత్రి రోజా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ వివాదంపై రోజా స్పందించారు. బాలయ్య చేసింది తప్పు అని ఆమె చెప్పుకొచ్చారు. ఇదే మాట.. ఎన్టీఆర్ కుటుంబాన్ని అంటే వారు ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు.
” ఏఎన్నార్ గురించి బాలయ్య అలా మాట్లాడడం చాలా తప్పని నేను అంటాను. ఎందుకంటే గతంలో నాగబాబు గారు కూడా కోటా శ్రీనివాసరావు గారిని ఏ విధంగా దూషించారో మనం చూసాం. అలాగే బాలకృష్ణ గారు ఎన్టీఆర్ కొడుకై.. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడం చాలా తప్పు. ఇదే ఎన్టీఆర్ ను వాళ్ళు మాట్లాడితే వారికి ఎంత బాధ ఉంటుందో.. వీరికి కూడా అంతే బాధ ఉంటుంది. ఎన్టీఆర్ కు సమానమైన హీరో నాగేశ్వరరావు. ఆయనను ఇలా అంటే.. వారి కుటుంబం, వారి ఫ్యాన్స్ కూడా బాధపడతారో అనేది కూడా అలోచించి మాట్లాడాలి. సో, ఎంత పడితే అంత మాట్లాడేయడం అనేది బాలయ్యకు ఎప్పుడు ఉండే అలవాటే.. దానికి ఇప్పటివరకు ఎటువంటి పనిష్మెంట్ రాలేదు కాబట్టి తనకు కూడా దానియొక్క తీవ్రత ఎలా ఉంటుందో తెలియలేదు. మరి అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలతో రోజా అక్కినేని ఫ్యాన్స్ ను రెచ్చగొట్టారని అభిమానులు చెప్పుకొస్తున్నారు. బాలయ్యకు ఇప్పటివరకు పనిష్మెంట్ రాలేదు కాబట్టి ఇప్పుడు పనిష్ చేయాలనీ కోరుతున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
