Site icon NTV Telugu

‘మా’తో మాకు సంబంధం లేదు: మంత్రి పేర్నినాని

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం కూడా పరోక్షంగా ఉంటుందంటూ విమర్శలు వస్తున్నా సంగతి తెలిసిందే.. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య మాటలయుద్ధం జరుగుతోండటంతో ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

అయితే తాజాగా, ‘మా’ ఎన్నికలతో మాకు ఎటువంటి సంబంధం లేదని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గానీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదు’ అని సమాచార, రవాణా శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు.

Exit mobile version