Site icon NTV Telugu

హ్యాపీ యానివర్సరీ మై లవ్… రానాకు మిహిక విషెస్

Miheeka wishes Rana on their 1st anniversary

“హ్యాపీ యానివర్సరీ మై లవ్” అంటూ రానా దగ్గుబాటి మిహికా తమ ఫస్ట్ యానివర్సరీ విషెస్ తెలియజేసింది. ఒక్క పోస్ట్ తోనే రానాపై తనకున్న ప్రేమను వెల్లడించింది. గత సంవత్సరం ఆగష్టు 8న రానా తన చిరకాల స్నేహితురాలు మిహీకా బజాజ్‌ ను రామానాయుడు స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఎంపిక చేసిన కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్టార్స్, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అప్పుడు కరోనా ఎక్కువగా ప్రబలుతుండడంతో అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. నిన్న రానా, మిహీకా మొదటి వివాహ వార్షికోత్సవం. ఈ ప్రత్యేక సందర్భంలో మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక అందమైన చిత్రాన్ని పంచుకుంది. ఇందులో ఆమె పూర్తిగా రానా ప్రేమలో మునిగిపోయినట్లు కన్పిస్తోంది.

Read Also : “భీమ్”కు “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ బాధ్యతలు

ఆ పిక్ తో పాటు “వార్షికోత్సవ శుభాకాంక్షలు మై లవ్! ఇది అత్యంత సంతోషకరమైన సంవత్సరం! ప్రపంచం ఎల్లలుదాటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు చాలా అద్భుతమైన మనిషిగా ఉన్నందుకు ధన్యవాదాలు!! ” అని మిహీకా పోస్ట్ చేసారు. అంతేకాదు #మై లైఫ్, #మై లవ్ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించారు. ప్రస్తుతం మిహిక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రానా తన భార్యపై ప్రేమను కుమ్మరించారు. ఆమె తన జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయిందని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by miheeka (@miheeka)

Exit mobile version