Site icon NTV Telugu

MenToo Trailer: అబ్బాయిగా బతకడం అంత ఈజీ కాదు బాసూ

Men Too

Men Too

MenToo Trailer: నరేష్ అగస్త్య, రియా సుమన్ జంటగా శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మెన్ టూ. లాంటెర్న్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మౌర్య సిద్దవరం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, వైవా హర్ష, కార్తీక్ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. సమాజంలో అబ్బాయిగా బతకడం ఎంత కష్టమో ఈ సినిమాలో చూపించారు. అమ్మాయిలకు మీటూ ఉన్నట్టే.. అబ్బాయిలకు మెన్ టూ ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు ఉంది ఈ ట్రైలర్ చూస్తుంటే.. అమ్మాయిల వలన అబ్బాయిలు ఎలాంటి కష్టాలను ఎదుర్కుంటున్నారో ట్రైలర్ చూపించారు.

NTR30: ‘దేవర’ టైటిల్ నాది.. నా టైటిల్ కొట్టేశారు.. బాంబ్ పేల్చిన బండ్లన్న

ఫెమినిజం కు డిక్షనరీ మీనింగ్ ను చూపిస్తూ మొదలైన ట్రైలర్ వినోదాత్మకంగా సాగింది. ఆటోలో వెనుక అమ్మాయి ఉంటే .. అబ్బాయిలను ముందు కూర్చోబెట్టే ఆటోవాడు.. ఆఫీస్ లో అబ్బాయిలను ఒకలా.. అమ్మాయిలను ఒకలా ట్రీట్ చేయడం.. ఇంట్లో పెళ్ళాం పోరు పడలేని భర్త.. ఇలా అందరు ఒక పబ్ లో కలుసుకొని తమ బాధలనుషేర్ చేసుకుంటారు. అక్కడకు వచ్చిన ముగ్గురు అబ్బాయిల కథ ఈ సినిమా. ఒక్క్కొకరు జీవితంల అమ్మాయి వలన బాధపడుతున్నవారే అయ్యి ఉంటారు. వారి జీవితాల్లో జరిగినసంఘటనలు ఏంటి.. అసలు అమ్మాయిలు ఏం చేశారు..? సమాజంలో అబ్బాయిగా బతకడం అంత కష్టమా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా మే 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Exit mobile version