NTV Telugu Site icon

Meher Ramesh: కొంప ముంచిన ‘క్రింజ్’ కామెంట్లు.. దెబ్బకి దిగొచ్చిన మెహర్ రమేష్

Meher Ramesh Speech

Meher Ramesh Speech

Meher Ramesh tweets Praising Ajith goes Viral in Social Media: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా 70% మార్పులు చేర్పులతో తెరకెక్కించామని దర్శకుడు మెహర్ రమేష్ చెబుతున్నారు. సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మెహర్ రమేష్ సోషల్ మీడియాలో సినిమా ట్రైలర్ మీద వచ్చిన నెగిటివ్ కామెంట్స్ పై స్పందించారు. చాలామంది ఇప్పుడు అర్థం తెలియకుండానే క్రింజ్ మూవీ అనేస్తున్నారు కానీ ఆ లెక్కకు వస్తే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి కూడా అలాంటి సినిమాలే కదా, వేదాళం సినిమాలో మీరు అనే క్రింజ్ ఆరు రెట్లు ఉంటుంది. అయినా ఆ సినిమా హిట్ అవ్వలేదా అని అర్థం వచ్చేలా మెహర్ రమేష్ కామెంట్లు చేశారు.

Breaking: సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ మృతి

అయితే ఇవి తమిళ ఆడియన్స్ కి వేరే విధంగా అర్థం కావడంతో ఆరు రెట్లు క్రింజ్ ఉందని భావిస్తున్న వేదాళం సినిమాని నిన్ను ఎవడు రీమేక్ చేయమన్నాడు? అంటూ ఒక రేంజ్ లో ఆయనపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. దీంతో విషయం అర్థం చేసుకున్న మెహర్ రమేష్ వేదాళం సినిమాని పొగుడుతూ మరో ట్వీట్ చేశారు. 2015 సంవత్సరంలో వేదాళం సినిమా చూసినప్పుడు భలే నచ్చిందని అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న బంధాన్ని డైరెక్టర్ శివా చూపించిన విధానం నచ్చి దాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ తాను చూపించాలనుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇదే కాదు 2009లో కూడా అజిత్ హీరోగా నటించిన బిల్లా సినిమాని ప్రభాస్ తో చేసి హిట్టు కొట్టానని ఇప్పుడు అజిత్ సార్ నటించిన మరో సినిమా తెలుగు అభిమానులకు చూపించేందుకు సిద్ధమవుతున్నానని ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. దీంతో తమిళ నెటిజన్లు కొంతవరకు వెనక్కి తగ్గారు, ఇప్పటికైనా అజిత్ లాంటి హీరో మీద ఇలాంటి కామెంట్స్ చేసుకోకుండా ఉంటే మంచిదంటూ కామెంట్లు చేస్తున్నారు.

Show comments