టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే స్టార్ హీరోలకు బిగ్గెస్ట్ ప్లాపులు ఇచ్చిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. బిల్లా, శక్తి, కంత్రి, షాడో లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మెహర్ చాలా గ్యాప్ తరువాత చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. బోళా శంకర్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. ఇక తాజాగా మెహర్.. మణిశర్మ బర్త్ డే వేడుకల్లో గెస్ట్ గా మెరిశాడు.
నిన్న సంగీత దర్శకుడు మణిశర్మ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఈ వేడుకకు హాజరైన మెహర్ రమేష్.. తాను దర్శకత్వం వహించిన కంత్రి సినిమాలోని టైటిల్ సాంగ్ కు స్టెప్స్ వేసి అదరగొట్టాడు. ఆ సాంగ్ ను మణిశర్మనే కంపోజ్ చేయడం విశేషం. ఈ విషయాన్ని మెహర్ రమేష్ తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. విశేషం ఏంటంటే.. కంత్రి సినిమాలో టైటిల్ సాంగ్ ను 2017 లో జూలై 11 న కంపోజ్ చేశారట. దీంతో మరోసారి అదే రోజు అదే సాంగ్ ను వింటూ డాన్స్ చేయడం అద్భుతమని చెప్పుకొచ్చాడు. ఇక వీడియో లో మణిశర్మ కూడా డాన్స్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఎంహార్ రమేష్ రీ ఎంట్రీ లోనైనా హాట్ ను అందుకుంటాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.
