Site icon NTV Telugu

Mega Mass: మూడు రోజుల్లో వంద కోట్లు… ఇది చిరు అరాచకం

Waltair Veerayya

Waltair Veerayya

గత మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో యాంటి ఫాన్స్ నుంచి చిరు పని అయిపొయింది అనే మాట వినిపించడం మొదలయ్యింది. ఇలాంటి మాటలని గత ముప్పై అయిదు సంవత్సరాలుగా వింటూనే ఉన్న చిరు, తన పని అయిపొయింది అనే మాట బయటకి వచ్చిన ప్రతిసారీ దాన్ని పాతాళంలో పాతేసే రేంజ్ హిట్ కొట్టాడు. ఎప్పుడూ చేసే లాగే ఈసారి కూడా తనపై వస్తున్న కామెంట్స్ ని అదఃపాతాళంలో పాతేసాడు చిరు. సంక్రాంతి పండగని ఒకరోజు ముందే తెస్తూ ఆడియన్స్ ముందుకి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చిన చిరు, అమలాపురం నుంచి అమెరికా వరకూ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తున్నాడు, కలెక్షన్ల సునామీ అనే పదం వింటాం కదా, దాన్ని నిజం చేసి చూపిస్తే ప్రతి థియేటర్ ఓవర్ ఫ్లోస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

జనవరి 13న ఆడియన్స్ ముందుకి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా కేవలం మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ ని రాబట్టి మెగాస్టార్ హిట్ కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా చేస్తోంది. ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్న వాల్తేరు వీరయ్య సినిమా తెలుగు రాష్ట్రాల్లో హ్యుజ్ ఆకుపెన్సీతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. థియేటర్స్ కౌంట్ రోజు రోజుకీ పెరుగుతుంటే డే 2 కన్నా డే 3 ఎక్కువ వసూళ్లని రాబడుతోంది అంటే వాల్తేరు వీరయ్య సినిమాని చూడడానికి ప్రేక్షకుల థియేటర్స్ కి ఎలా వెళ్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. సంక్రాంతి హాలీడేస్ మరో 48 గంటల పాటు ఉంటాయి కాబట్టి మొదటి వీకెండ్ రీచ్ అయ్యే సరికి వాల్తేరు వీరయ్య సినిమా 150 కోట్ల గ్రాస్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. ఒక యావరేజ్ డైరెక్టర్ తో చిరు చేస్తున్న ఈ బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూసిన తర్వాత అయినా సరే అన్నయ్య పని అయిపొయింది అనే కామెంట్స్ చేసే వాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాలి. నిజానికి ఆ కామెంట్స్ చేసే వాళ్లు సైలెంట్ అవ్వరు, అవ్వకపోవడమే మెగా అభిమానులకి కూడా కావాలి అప్పుడే కదా మెగాస్టార్ హిట్ కొట్టినప్పుడు రీసౌండ్ వచ్చే రేంజులో సెలబ్రేషన్స్ చేసుకోగలిగేది. అందరూ హిట్ అన్న టైంలో కలెక్షన్స్ రాబడితే కిక్ ఏముంటుంది, యావరేజ్ అనే టాక్ తెచ్చుకున్న సినిమాతోనే పాత రికార్డులని చెల్లా చెదురు చేస్తేనే అసలు మజా ఉంటుంది.

Exit mobile version