Site icon NTV Telugu

Chiru: బలగం సినిమా చిత్ర యూనిట్ కి ‘చిరు’ సన్మానం…

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా నచ్చినా అది చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా ఆ సినిమాని తెరకెక్కించిన వాళ్లకి ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటాడు. ఆ సినిమా మరింతగా నచ్చితే ఇంటికి పిలిపించి మరీ కలిసి అభినందచడంలో చిరు ముందుంటాడు. అలా ఇటివలే దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు దర్శకత్వంలో రూపొందిన ‘బలగం’ సినిమా చూసిన చిరు ‘బలగం’ చిత్ర యూనిట్ ని భోలా శంకర్ సెట్స్ కి పిలిపించి శాలువాకప్పి మరీ సత్కరించాడు. అందరినీ పేరు పేరునా పలకరించిన చిరు దర్శకుడు వేణుని ప్రత్యేకంగా అభినందించాడు. “హాయ్ వేణు… కంగ్రాచ్యులేషన్స్! గుడ్ జాబ్… కాదయ్యా… నువ్వు సినిమా ఇంత బాగా తీసి మాకు షాకులు ఇస్తే ఎలా చెప్పు?’ అంటూ శాలువా కప్పి వేణును చిరు సత్కరించాడు. ఈ సమయంలో వేణు, చిరు కాళ్లు మొక్కి మెగాస్టార్ బ్లేసింగ్స్ తీసుకున్నాడు.

Read Also: Arjun Reddy: ఛీ ఛీ.. ఇలాంటి సినిమా చేసిందా.. అర్జున్‌రెడ్డిపై స్వప్న షాకింగ్ కామెంట్స్

”నిజాయతీ ఉన్న సినిమా బలగం. అది ట్రూ ఫిల్మ్. కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నా గానీ… సినిమాలో నిజాయతీ ఉంది. వేణు నిజాయతీగా తీశాడు. సినిమాకు న్యాయం చేశాడు. చాలా బావుంది. మంచి నేటివిటీ, తెలంగాణ సంస్కృతిని వంద శాతం చూపించాడు. అతను చిన్నతనం నుంచి చూసిన ప్రతిదీ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యింది. ఒకసారి జబర్దస్త్ లో ఒగ్గు, బుర్ర కథలు వంటివి తీసుకుని స్కిట్ చేశాడు. నేను అది చూశా. చాలా బాగా చేశాడు. అప్పటి నుంచి అతని మీద గౌరవం పెరిగింది. అతనిలో అంత టాలెంట్ ఉందా? అనుకున్నా. ఈ సినిమా చూసిన తర్వాత… గొప్పగా తీశాడని అనుకున్నా” అని చిరంజీవి చెప్పారు. చిరు అభినందించడంతో బలగం చిత్ర యూనిట్ క్లౌడ్ నైన్ లో ఉన్నారు.

Exit mobile version