Megastar Chiranjeevi to throw a huge party for grand daughter birth: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మాత్రమే కాదు ఆయన అభిమానుల కుటుంబంలో కూడా ఆనందం వెల్లివిరిసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లయిన 10 ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 1.29 నిముషాలకు ఒక పాప జన్మించింది. ఇక మహాలక్ష్మి జన్మించింది అంటూ మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి సహా అయన కుటుంబ సభ్యులు అందరూ ఆనందంలో మునిగిపోయారు. నిజానికి ఉపాసనకి పిల్లలు కలగడం ఆలస్యం కావడంతో తాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నట్లు ఆ మధ్య ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్కడికి వెళ్లినా ‘గుడ్ న్యూస్’ ఎప్పుడు అని అడిగే వారు, దాంతో మానసికంగా కష్టంగా ఉండేది అని ఆమె వెల్లడించారు.
Lust Stories 2 : తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించిన విజయ్ వర్మ..
ఇక మెగాస్టార్, ఆయన భార్య సురేఖ కూడా తన కొడుకు, కోడలు త్వరగా మానవడినో మనవరాలినో తమ చేతిలో పెడితే బాగుండు అని తమకు ఇష్టమైన దేవుళ్ళని మొక్కుకున్నారు కూడా. ఇక వీరి కోరిక మన్నించి దేవుడు ఎట్టకేలకు ఆ ఇంట లిటిల్ మెగా ప్రిన్సెస్ ను జన్మింపచేశాడు. ఇక ఇప్పటికే ఆనందంలో మునిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి చరణ్ కూతురు పుట్టిన సందర్భంగా త్వరలోనే ఇండస్ట్రీ స్నేహితులు అందరికీ ఒక మెగాపార్టీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ‘మెగా లిటిల్ ప్రిన్సెస్’ బర్త్ సెలెబ్రేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా మరో వైపు, రామ్ చరణ్, ఉపాసన తమ కుమార్తెకు ఏమి పేరు పెడతారు అని ఫ్యాన్స్ అందరూ ఆత్రుతగా ఉన్నారు. మెగాస్టార్ కి అందరూ మానవరాళ్లే ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కూతుళ్ళకు చెరో ఇద్దరు అమ్మాయిలు ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా కుమార్తె జన్మించింది. సో, మొత్తంగా మెగాస్టార్ కి ఐదుగురు మనవరాళ్లు అన్నమాట.
Boss Party: మనవరాలి ఆగమనం..సన్నిహితులకు ‘మెగా పార్టీ’!
Show comments