NTV Telugu Site icon

Kannappa: మంచు బాబుల కోసం చిరంజీవి కూడానా?

Megastar Chiranjeevi Great Gesture

Megastar Chiranjeevi Great Gesture

Megastar Chiranjeevi to Become Part of Kannappa for Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప. గతంలో కృష్ణంరాజు హీరోగా నటించిన భక్తకన్నప్ప అనే సినిమా ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేటి ట్రెండుకు తగినట్టుగా ఒక భక్తకన్నప్ప సినిమా చేయాలని మంచు విష్ణు సంకల్పించాడు తన డ్రీమ్ ప్రాజెక్టుగా మంచు విష్ణు చెప్పుకుంటున్న ఈ ప్రాజెక్టు ఈ మధ్య కాలంలో శ్రీకాళహస్తిలో చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు. తర్వాత ఈ సినిమా షూటింగ్ అంతా న్యూజిలాండ్ లోనే జరుపుతామని అప్పటి పరిస్థితులు అప్పటి అటవీ పరిసరాలను సృష్టించడం కంటే న్యూజిలాండ్ లో ఉన్న అటవీ ప్రాంతంలో షూట్ చేయాలని భావిస్తున్నామని సినిమా యూనిట్ అంతటినీ తీసుకుని మంచు విష్ణు న్యూజిలాండ్ బయలుదేరి వెళ్ళాడు. దాదాపు నెల రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది.

Teen Queer Pranshu: ఇన్‌స్టా రీల్స్‌కి బ్యాడ్ కామెంట్స్.. 16 ఏళ్ల క్వీర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

ఇక ఈ సినిమాలో శివుడిగా ప్రభాస్ పార్వతి దేవిగా నయనతార నటిస్తున్నారని వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం మోహన్ లాల్, తమిళం నుంచి శరత్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. మోహన్ బాబు ఒకపక్క ఈ సినిమాని నిర్మిస్తూనే మరో పక్క సినిమాకి సంబంధించిన ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్టుగా కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో నటించమని మోహన్ బాబు మెగాస్టార్ చిరంజీవిని కోరినట్లుగా తెలుస్తోంది. పెద్ద నిడివి ఉన్న పాత్ర ఏమి కాదు ఒక మంచి అతిథి పాత్రలో నటించమని ఆయన కోరగా దానికి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే కొన్ని విభేదాలు ఉన్నా సరే మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు మంచి సన్నిహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ దాదాపుగా ఒకేసారి కెరీర్ మొదలు పెట్టారు మంచి స్నేహితులుగా కూడా మెలుగుతూ ఉండేవారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వంటి కొన్ని భేదాభిప్రాయాలు తప్ప వారి మధ్య దూరం అయితే లేదని ఇప్పుడు తన స్నేహితుడు కోరిన వెంటనే తన స్నేహితుడి కుమారుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. హిందీ మహాభారతం సీరియల్ లోని పలు ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ ఈ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా మంచు విష్ణు తన తండ్రి మంచు మోహన్ బాబుతో కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.