కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఈసారి చాలామంది సెలెబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిన్న రాత్రి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని, స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు చిరంజీవి. త్వరలోనే కోలుకుని మిమ్మల్ని కలుస్తాను అంటూ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న విషయాన్నీ స్పష్టం చేశారు.
మహేష్ బాబు, కీర్తి సురేష్, మంచు లక్ష్మి, థమన్ వంటి సినిమా సెలెబ్రిటీలంతా కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా కరోనా సోకిన వారి జాబితాలో చేరిపోతున్న స్టార్స్ లిస్ట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా మహమ్మారి తగ్గేదే లే అంటూ విజృంభిస్తోంది.
Read Also : మహేష్ ఎమోషనల్… గౌతమ్ కారణంగానే చిన్నారులకు సహాయం
