Site icon NTV Telugu

Chiru: అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి నుంచి మదర్స్ డే రోజున స్పెషల్ ట్వీట్ బయటకి వచ్చింది. “అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి #HappyMothersDay ” అంటూ చిరు ట్వీట్ చేశాడు. తల్లులందరికీ మదర్స్ డే విషెస్ చెప్తూ చిరు ఈ పోస్ట్ చేశాడు. అంజనా దేవితో నాగబాబు, పవన్ కళ్యాణ్, చెల్లలతో చిరు కొన్ని ఫోటోస్ దిగి వాటిని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మెగా ఫాన్స్ కి ఖుషి చేస్తున్నాయి. నాగబాబు, చిరు కలిసి ఒక ఫోటోలో కనిపించారు. మెగా బ్రదర్స్ అనే ముగ్గురు అన్నదమ్ములని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన అంజనా దేవికి మెగా అభిమానులు ఎప్పటికీ రుణపడి ఉంటారు.

Read Also: Simhadri: రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్… ఇదెక్కడి అరాచకం సామీ

Exit mobile version