మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల కంబ్యాక్ తర్వాత పూర్తి స్థాయి మాస్ గెటప్ లోకి మారి నటిస్తున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’. వింటేజ్ చిరుని గుర్తు చేసేలా బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సంధర్భంగా ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కి గ్రాండ్ గా చేశారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, రవితేజలు సూపర్బ్ గా మాట్లాడి అభిమానులని సంతోషపరిచారు. తన స్పీచ్ లో ఒక మ్యాజిక్ ని మైంటైన్ చేసే చిరు, ఈసారి ఆ మ్యాజిక్ ని బాలకృష్ణ విషయంలో చూపించాడు. వాల్తేరు వీరయ్య సినిమాని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌజ్ బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాని కూడా నిర్మించింది.
Read Also: Ravi Teja: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కాదు.. బ్లాక్ బస్టర్
జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాపై కూడా భారి అంచనాలు ఉన్నాయి. చిరు, బాలయ్యల బాక్సాఫీస్ వార్ కి తెలుగు రాష్ట్రాల అభిమానులు ప్రిపేర్ అవుతున్నారు. తమ మధ్య పోటీ సినిమాలకి మాత్రమే పరిమితం అన్నట్లు చిరు, ‘వాల్తేరు వీరయ్య’ స్టేజ్ పైన “మైత్రీ మూవీ మేకర్స్ ని రెండు సినిమాలు రెండు కళ్ళ లాంటివి, ఈ సంక్రాంతికి రెండు సినిమాలు ఆడాలి. వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్ అవ్వాలి. మిమ్మల్ని చూసి కొందరికి కుల్లు పుట్టాలి” అన్నాడు. చిరు నోటి నుంచి వీర సింహా రెడ్డి పేరు రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం చిరు స్పీచ్ యుట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. మరి చిరు కోరుకున్నట్లు వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు సంక్రాంతి సీజన్ ని రఫ్ఫాడిస్తాయేమో చూడాలి.
Read Also: Director Bobby: చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు.. బెండు తీయడానికి పవన్ వచ్చాడు
