Site icon NTV Telugu

Chiru: అది ఆస్కార్ అవార్డ్ కన్నా తక్కువ కాదు…

Chiru

Chiru

ఇండియన్ సినిమా ప్రైడ్ గా ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఆర్క్ గురించి హాలీవుడ్ డైరెక్టర్ జీనియస్ ‘జేమ్స్ కెమెరూన్’ మాట్లాడుతూ… “ఆర్ ఆర్ ఆర్ సినిమా 2/3 పార్ట్స్ కి వచ్చే వరకూ రామ్ పాత్రను అర్థం చేసుకోవడం చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఆపై అతని బ్రెయిన్ లో ఏమి జరుగుతుందో, మీరు చివరకు అర్థం చేసుకుంటారు. అది హృదయ విదారకంగా అనిపిస్తుంది. అదే ఆర్ ఆర్ ఆర్ ట్రంప్ కార్డ్ అయ్యింది. ఈ విషయాన్ని ఇటీవల రాజమౌళికి స్వయంగా చెప్పాను. కానీ, మాట్లాడుకోవడానికి మాకు ఎక్కువ సమయం దొరకలేదు. నేను అతనితో మరింత మాట్లాడాలనుకుంటున్నాను” అని చెప్పాడు.

వరల్డ్స్ టాప్ డైరెక్టర్ రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ మెగా అభిమానులు వైరల్ చేశారు. ఇదే వీడియోని మెగాస్టార్ చిరంజీవి కూడా షేర్ చేస్తూ ‘‘మీలాంటి గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని చరణ్ పాత్ర గురించి చెప్పడం, నిజంగా ఆస్కార్ కంటే గొప్ప అవార్డ్‌గా భావిస్తున్నాను. ఇది చరణ్‌కు చాలా గొప్ప గౌరవం. మీలాంటి వారి నుంచి ఇలాంటి గొప్ప మాటలు అందుకునే స్థాయికి వచ్చిన నా బిడ్డ రామ్ చరణ్‌ను చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నాను. మీ అభినందన.. చరణ్ చేయబోయే సినిమాలకు ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను..’’ అని ట్వీట్ చేశాడు. చిరు చేసిన ట్వీట్ కి మెగా ఫాన్స్ కామెంట్స్‌తో, రీ ట్వీట్స్‌తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

Exit mobile version