Site icon NTV Telugu

Chiranjeevi: సీతారామం చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్

Chiru Praises Sitaramam

Chiru Praises Sitaramam

Megastar Chiranjeevi Praises Sitaramam Movie: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘సీతారామం’ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం అందరి మనసులు దోచుకోవడంతో మన్ననలు అందుకుంటోంది. సెలెబ్రిటీల నుంచి కూడా ఈ సినిమా ప్రశంసలు పొందుతోంది. తాజాగా ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. రీసెంట్‌గా ఈ సినిమాను వీక్షించిన ఆయన.. ట్విటర్ మాధ్యమంగా చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

‘‘ఇప్పుడే సీతారామం సినిమా చూడటం జరిగింది. ఒక్క చక్కటి ప్రేమకావ్యాన్ని చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా.. ఎంతో విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ ప్రేమకథని ఆవిష్కరించిన విధానం ఎంతగానో నచ్చింది. మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్, స్వప్నా దత్, ప్రియాంకా దత్‌లకు.. ఒక ప్యాషన్‌తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి.. కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్‌కి.. అన్నింటికన్నా ముఖ్యంగా సీతా-రామ్‌లుగా ఆ ప్రేమకథకి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్‌లకు.. సూత్రధారి పాత్ర పోషించిన రష్మికా మందణ్ణకి.. మొత్తం టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు’’ అని చిరు ట్వీట్ చేశారు.

అంతేకాదు.. ప్రేక్షకుల మనసులో దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని తాను మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నానని చిరు ఆకాంక్షించారు. కాగా.. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కొల్లగొడుతోంది. ఇప్పటివరకూ తమ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్టు స్వయంగా చిత్రబృందమే ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. తమ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడంతో.. సెప్టెంబర్ 2వ వ తేదీన హిందీ వర్షన్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి.. అక్కడ కూడా ఈ చిత్రం సేమ్ రిజల్ట్‌ని రిపీట్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Exit mobile version