NTV Telugu Site icon

Waltair Veerayya: రెండు దశాబ్దాల వెనక్కి వెళ్లిన చిరు…

Waltair Veerayya

Waltair Veerayya

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా బెస్ట్ లుక్స్ ఉన్న సినిమా, అందరికీ నచ్చిన సినిమా, ఫుల్ లెంగ్త్ చిరు కామెడీ టైమింగ్ వర్కౌట్ అయిన సినిమా, లవ్-ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘శంకర్ దాదా MBBS’ మాత్రమే. ఈ సినిమా తర్వాత చిరు చాలా సినిమాల్లో నటించాడు కానీ అవి దాదాపు ఎదో ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన సినిమాలే. ఖైదీ నంబర్ 150 సోషల్ కాజ్, సైరా పీరియాడిక్ వార్ డ్రామా, గాడ్ ఫాదర్ పొలిటికల్ థ్రిల్లర్… ఇలా చిరు రీఎంట్రీ తర్వాత నటించిన సినిమాలు కూడా ఎదో ఒక సెక్టార్ కి కనెక్ట్ అయ్యే కథతో రూపొందిన చిత్రాలే. అందుకే అందరికీ నచ్చిన సినిమా అనగానే, అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయ్యి ఉన్న ‘శంకర్ దాదా MBBS’ సినిమా పేరు చెప్తారు. ఇప్పుడు ఈ మూవీ ప్లేస్ ని రీప్లేస్ చెయ్యడానికి రెడీ అవుతోంది ‘వాల్తేరు వీరయ్య’ సినిమా.

మెగాస్టార్ చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన డైరెక్టర్ బాబీ, మెగా అభిమానులకి వింటేజ్ చిరుని చూపించడానికి రెడీ అయ్యాడు. చిరు లుక్ నుంచి సాంగ్స్ లో గ్రేస్ వరకూ ప్రతి విషయంలో ఒకప్పటి చిరుని గుర్తు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు బాబీ. అందుకే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి ఏ అప్డేట్ బయటకి వచ్చినా, ఏ సాంగ్ రిలీజ్ అయినా అది ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇటివలే రిలీజ్ అయిన పూనకలు లోడింగ్ సాంగ్ చూస్తే, వింటేజ్ చిరులోని స్వాగ్ మరియు గ్రేస్ పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. ఇలాంటి పోస్టర్ ఒకటి న్యూ ఇయర్ కానుకగా బయటకి వచ్చింది. ఇందులో చిరు పూల చొక్కా వేసుకోని యూత్ ఫుల్ గా ఉన్నాడు. ప్రమోషనల్ కంటెంట్ తో వింటేజ్ వైబ్స్ ని క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయిన బాబీ అండ్ టీం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చిరు కంబ్యాక్ హిట్ ఇస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తారో లేదో తెలియాలి అంటే జనవరి 13 వరకూ ఆగాల్సిందే.

Show comments