NTV Telugu Site icon

Chiranjeevi: కొనసాగుతున్న చిరు లీకుల పరంపర… ఈసారి ఏం వదిలాడో చూడండి

Chiranjeevi

Chiranjeevi

టాలీవుడ్ లో, మరీ ముఖ్యంగా మెగా అభిమానుల్లో చిరూ లీక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. తన సినిమాల గురించి మేకర్స్ కన్నా ముందే లీక్ ఇస్తూ హైప్ పెంచడంలో మెగాస్టార్ దిట్ట. ఈ విషయంలో ఆపుడప్పుడూ ఫన్నీ మీమ్స్ కూడా బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక లీక్ నే చిరు మళ్లీ ఇచ్చాడు, ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ ఏం వస్తుందా అని మెగా ఫాన్స్ వెయిట్ చేస్తుంటే, నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ సాంగ్ అంటూ చిరు లీక్ ఇచ్చేశాడు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుంచి నాలుగు పాటలు బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక 5వ పాటని దేవి శ్రీ ప్రసాద్ ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ అనే క్యాచీ లైన్ తో కంపోజ్ చేసాడట. శేఖర్ మాస్టర్ ఖోరియోగ్రఫి చేసిన ఈ మెలోడి సాంగ్ ఆడియన్స్ ని సీట్లలో కూర్చోనివ్వదట. ఫ్రాన్స్ లోని ఒక సిటీలో ఉన్న బ్యూటిఫుల్ లోకేషన్స్ లో షూట్ చేశారని చిరు లీక్ చేశాడు.

Read Also: Waltair Veerayya: రెండు దశాబ్దాల వెనక్కి వెళ్లిన చిరు…

డిసెంబర్ 17న జరిగిన ‘నీకేమో అందమేక్కువ’ సాంగ్ తో ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యింది. దర్శకుడు బాబీ ఈ మూవీని బెస్ట్ ఫ్యాన్ మేడ్ ఫిల్మ్ గా తీర్చిదిద్దుతున్నాడు. జనవరి 13న వింటేజ్ మెగాస్టార్ ని చూపిస్తాం అంటూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ చేస్తుంటే, ట్రైలర్ గురించి అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని మెగా ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చే లోపు, మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చెయ్యబోతున్నారు అనే లీక్ ఇచ్చేస్తే మెగా ఫాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. “బాసు కాస్త ఆ ట్రైలర్ లీక్ కూడా ఇచ్చేస్తే మెగా ఫాన్స్ అంత సంక్రాంతిని కాస్త ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటారు”.

Show comments