Megastar Chiranjeevi Targetting 2024 Sankranthi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పటికే పలు సినిమాలను లైన్లో పెట్టారు. చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కేఎస్ రామారావు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: ‘Spy’ Movie: ‘స్పై’ చుట్టూ ఏం జరుగుతోంది.. క్లారిటీ లేకుండానే బుకింగ్స్ కూడా?
ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన వెంకీ కుడుముల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నట్టుగా గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా నిలిచిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం మీద అటు మెగాస్టార్ కానీ ఇటు దానయ్య కాంపౌండ్ నుంచి గానీ ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా ఫైనల్ చేశారని తెలుస్తోంది. గతంలో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
Also Read: Tollywood top 10: టాలీవుడ్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 సినిమాలివే!
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జూలై నెలలో ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మలయాళ బ్రో డాడీ రీమేక్ అని కూడా ప్రచారం ఉంది కానీ ఆ విషయం మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అంతేకాక ఈ సినిమాకి ఎవరు నిర్మాతలుగా వ్యవహరిస్తారని విషయం మీద ప్రస్తుతానికి అధికారికంగా సమాచారం లేదు. ఇక జులైలోనే షూట్ కాబట్టి సినిమాకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తే పూర్తి అవగాహన వచ్చే అవకాశం కనిపిస్తోంది.