Site icon NTV Telugu

Chiranjeevi: బిజీ షెడ్యూల్ వదిలి భార్యతో టూర్ చెక్కేసిన మెగాస్టార్

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు  గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా వారికి ఈ లైనప్ తో చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య ‘ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంకా లైన్లో ‘గాడ్ ఫాదర్’, ‘మెగా 154’, ‘భోళా శంకర్’, షూటింగ్ జరుపుకుంటుండగా మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు.

ఇక ఈ సినిమా షూటింగ్ లతో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్న చిరు కొద్దిగా బ్రేక్ తీసుకున్నాడు. షూటింగ్లకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి వెకేషన్ కి బయల్దేరాడు. భార్య సురేఖ తో కలిసి చిరు అమెరికా, యూరప్ ట్రిప్ కు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో చిరు, సురేఖ ప్రయాణిస్తున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆచార్య ప్లాప్ టాక్ విన్న తరువాత ఆ మాత్రం చేంజ్ అవసరం అని కొందరు.. ఎన్ని బిజీ పనులు ఉన్నా ఫ్యామిలీ కి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్న హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version