Site icon NTV Telugu

Chiru: కొరియన్ అంబాసిడర్ కు చిరు పార్టీ

Chiru

Chiru

దక్షిణ కొరియా భారతదేశ రాయబారి చాంగ్ జే బక్ బృందానికి మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం తేనేటి విందు ఇచ్చారు. ఇటీవల శ్రీనగర్ లో జరిగిన జీ20 సమ్మెట్ లో చాంగ్ బృందం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు వేసిన స్టెప్స్ ను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నిజానికి వారు ఆ పాటకు స్టెప్ వేసినప్పటి నుంచి చాంగ్ ను కలవాలని అనుకుంటున్నానని, అది ఇప్పటికి కుదిరిందని అన్నారు చిరంజీవి. సౌత్ కొరియన్ పాప్ సంగీతంతో పాటు సౌత్ కొరియన్ చిత్రాలకు భారతదేశంలో ఎనలేని ఆదరణ ఉందని తెలియచేస్తూ ఇప్పుడు ఇండియన్ మూవీస్ సైతం సౌత్ కొరియాలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని చెప్పారు చిరంజీవి. చిరంజీవి, రామ్ చరణ్ ను కలవడం సంతోషకరమైన విషయమని కొరియన్ అంబాసిడర్ చాంగ్ తెలిపారు.

Exit mobile version