Site icon NTV Telugu

Chiranjeevi: మాస్ డైరెక్టర్ ‘కథ’ ఓకే చేసిన చిరంజీవి.. ఇక రచ్చ రచ్చే?

Harish Shankar Chiranjeevi

Harish Shankar Chiranjeevi

Megastar Chiranjeevi- Harish Shankar Movie: ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఆయన సోదరి పాత్రలో మాత్రం కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా విడుదలైన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేశారు. జూలై నెలలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమాకి బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి తనయురాలు సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి మరో ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

Rachakonda: జూన్ 24 నుంచి జూన్ 30 వరకు రాచకొండ పరిధిలో నిషేధాజ్ఞలు.. ఇవి అస్సలు చేయకూడదు!

ఆ ప్రాజెక్టు మరెవరితోనో కాదు టాలీవుడ్ లో మాస్ సినిమాలో డైరెక్ట్ చేస్తాడని పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ తో. తెలుగులో షాక్, మిరపకాయ్, గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ వంటి మాస్ మసాలా మూవీస్ తెరకెక్కించిన హరీష్ శంకర్ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కి ఇంకా గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఇతర సినిమాల స్క్రిప్టుల మీద కూడా ఆయన ఫోకస్ పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి దృష్టికి కూడా ఒక సినిమా కథ తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ కథ మెగాస్టార్ చిరంజీవికి నచ్చడంతో బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురమ్మని కోరినట్లు తెలుస్తోంది. అంతా ఓకే అయితే కనుక కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫైనల్ అయితే కనుక అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. చూడాలి మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది.

Exit mobile version